28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి వలలో చిక్కిన నారాయణపేట ఆర్డీవో

Must read

📰 Generate e-Paper Clip

 

నారాయణ పేట, బతుకమ్మ :

 

జనన ధ్రువీకరణ పత్రాల కోసం లంచం డిమాండ్ చేసిన నారాయణ పేట ఆర్డీవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారులకు అందిన సమాచారంతో వల పన్ని ఆర్డీవో ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి తన స్నేహితుల జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నాడు. బర్త్ సర్టిఫికెట్ ఆలస్య నమోదుకు సంబందించిన ఫైలు ఆమోదం కోసం ఆర్డీవో పత్లావత్ రామచందర్ రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు మంగళవారం ఆర్డీవో లంచం తీసుకుంటుండగా మహబుబ్ నగర్ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వద్దని ఏసీబీ అదికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, వాట్సాప్ నెంబర్ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

More articles

Latest article