27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

క్రీడలు శారీరక ఆరోగ్యం అందించడంతో పాటు, మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్  ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని సోమవారం ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా జడ్జి భారత లక్ష్మీ, సీపీ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు.

 

Sports relieve mental stress

 

ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పోలీస్, న్యాయశాఖ తదితర శాఖల్లో ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి లోనవుతారని అన్నారు. వారిని శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంచడానికి ఈ క్రీడలు ఉపయోగపడుతాయని అన్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకే కాక ఉద్యోగులకు కూడా చాలా అవసరమని ఆయనన్నారు. క్రీడల వల్ల విద్యార్థులు చదువుల్లో మరింత ఉత్సాహంగా ఉంటారని, ఉద్యోగస్తులు మరింత చురుకుగా ఉంటారని అన్నారు. ఈ క్రీడా పోటీలు ఈ నెల 20 నుండి 28 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్)/ఎన్ఎస్ఈ కన్వీనర్, డిసిపి జి.బస్వా రెడ్డి, అదనపు డీసీపీ(ఏ.ఆర్) రామచంద్రరావు ఎన్.ఎస్.ఈ జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవిత రెడ్డి, ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, శివప్రసాద్, దుశ్శాంత్, ఎన్ఎస్ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సిటిసి ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, మస్తాన్ అలీ, ఫోర్త్ అడిషనల్ జడ్జ్ దుర్గాప్రసాద్, సెకండ్ అడిషనల్ జడ్జి నారాయణ, పిడిఎం గోపి కృష్ణ, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు జిల్లాలోని అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు.

 

Sports relieve mental stress

 

ఈ క్రీడలను ఎవరైనా ఆన్ లైన్ లో చూడాలనుకుంటే క్రిక్ హీరోస్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని చూడాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం పోలీస్ లెవన్, జ్యూడిషల్ లెవన్ టీం లకు మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో పోలీస్ లెవన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, 8 ఓవర్లలో 81/1 స్కోరు చేశారు. బదులుగా జ్యుడిషియల్ లెవన్ 37/1 కు పరిమితమైంది. దాంతో పోలీస్ లెవన్ 44 పరుగులతో గెలిచింది.

 

Sports relieve mental stress

More articles

Latest article