నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రైతుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని, రైతులను సమీకరణ చేసే పోరాటాలకు సిద్ధం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. పట్టణంలోని నాందేవాడ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా నాలుగవ మహాసభలు నిర్వహించారు. ఈ మహా సభల్లో గత మూడు సంవత్సరాలుగా చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు ప్రణాళిక రూపొందించారు. పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా దేవేందర్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పల్లపు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం గంగాధరప్ప, టీ భూమన్న, జిల్లా సహాయ కార్యదర్శులుగా పి నాగలక్ష్మి, ఇడగొట్టి వడ్డన్న, జిల్లా కమిటీ సభ్యులుగా చిన్నయ్య, ఎల్లప్ప, రాజేశ్వర్, ఎర్ర సాయిలు, ముత్తన్న, దేవునిరి రాజన్న, గోయిందారం లింగం లను ఎన్నుకున్నారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా నాలుగవ మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్ ధన్యవాదాలు తెలిపారు.
