రైతుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తాం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రైతుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని, రైతులను సమీకరణ చేసే పోరాటాలకు సిద్ధం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. పట్టణంలోని నాందేవాడ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా నాలుగవ మహాసభలు నిర్వహించారు. ఈ మహా సభల్లో గత మూడు సంవత్సరాలుగా చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు ప్రణాళిక రూపొందించారు. పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం నూతన...