- జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, బతుకమ్మ : మానసిక ఆరోగ్యం మహాభాగ్యం అని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ గల ఫోమ్ బోర్డులను కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఛాంబర్ లో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం మహాభాగ్యం అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు ,మహిళలు, ప్రజలందరికీ మానసిక ఆరోగ్యంపై విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు ముఖ్యమైన ప్రదేశాల్లో, కలెక్టర్ ఆఫీసులో ఈ బోర్డులను ప్రదర్శించాలన్నారు. తర్వాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు నిర్వహించిన వర్క్ షాప్ నాకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ అధ్యక్షత వహించి నిర్వహించారు .ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం పై అనేక సూచనలు సూచించడమే కాకుండా ఉద్యోగులందరూ మానసిక ఒత్తిడికి గురికాకుండా వారి వారి రోజువారి వీధుల్లో చక్కని ప్రణాళికతో నిర్వహించినట్లయితే ఎటువంటి మానసిక ఒత్తిడికి గురికారు అని తెలియజేశారు . అదేవిధంగా వర్క్ షాప్ లో అవగాహన కలిగించడానికి విచ్చేసిన జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం అధికారి డాక్టర్ రవితేజ ఇన్నమూరి మాట్లాడుతూ మానసిక ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదన్నారు. చిన్న చిన్న సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిపారు. అనవసర ఆందోళనలతో ఆత్మహత్యల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. మానసిక ఒత్తిడితో బాధపడేవారు టోల్ ఫ్రీ నెంబర్ 14416 కు ఫోన్ చేసి ఉచిత కౌన్సిలింగ్ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.బి రాజశ్రీ, ఎన్ హెచ్ ఎం ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు, జిల్లా పీఓ ఎన్సీడీ అధికారి డాక్టర్ వినీత్ రెడ్డి కార్యాలయ పర్యవేక్షకులు చందర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేష్, డీహెచ్ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్లు, స్వామి సులోచన, డిపిఓ విశాల కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

