ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం నుంచి డీఎస్సీ ఫలితాలలో ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ గౌడ్ గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ డైరెక్టర్ నాగం గోపి, కౌన్సిలర్లు మహేశ్వరీ విద్యాసాగర్, పోచయ్య, కంఠం, నునుగొండ శ్రీనివాస్, గాదె తిరుపతి, గణేష్, ఎల్లారెడ్డి మండల నాయకులు పాల్గొన్నారు.
