28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా పీఆర్ టీయు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సంఘం జెండాను ఆవిష్కరించిన కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పీఆర్ టియు తెలంగాణ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య పిలుపుమేరకు గురువారం ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని వర్ని చౌరస్తాలోని సంఘ కార్యాలయ ఆవరణలో పీఆర్ టీయు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ పీఆర్ టీయు తెలంగాణ సంఘం 9 ఏప్రిల్ 2011 రోజున ఆవిర్భవించి దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూపుతూ, హక్కుల పరిరక్షణ, విధులు నిర్వహణ, సామాజిక న్యాయం అనే సిద్ధాంతాలతోటి ముందుకెళ్తుందన్నారు. సంఘం ఆవిర్భవించి నేటికి 15 సంవత్సరాలు పూర్తిచేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

More articles

Latest article