నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గత ఏడాది నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కమిటీ అధ్యక్షుడుగా బొబ్బిలి రామకష్ణ ను నియమించిన విషయం తెలిసిందే. అయితే కార్యవర్గాన్ని నియమించలేదు. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలను గెలుచుకుని మిత్ర పక్షమైన మజ్లీస్ తో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బల్దియా ఎన్నికల్లో పని చేసిన వారితో పాటు త్యాగాలు చేసిన వారిని గుర్తించి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ఉగాది పర్వదినాన నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కమిటీ ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ని రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గురువారం అధికారికంగా విడుదల చేశారు.

ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా అంతరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, సయ్యద్ సలీం, కోర్వ రాజేంద్రప్రసాద్ లను ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శులుగా జిల్లెల రమేష్, కస్తూరి గంగరాజు, ధర్మారం అవీన్, సర్దార్ నరేంధర్ సింగ్, సయ్యద్ హర్షద్, బాత్నతే శంకర్, కుంచెపు నగేష్ లను ఎంపిక చేశారు. అలాగే కోశాధికారిగా సకినాల శివప్రసాద్, అధికార ప్రతినిధులుగా మల్యాల గోవర్ధన్, మొహమ్మద్ జియా అహ్మద్, కార్యదర్శులుగా మంతెన సంపత్, పత్తి శోభన్ కుమార్, గజింగ్ ప్రవీణ్, డండోట్కర్ వినోద్, షేక్ అఫ్సర్, ఆకుల వెంకటేష్ (రాజు), సడక్ శేఖర్ రెడ్డి, ఉప్పరి స్వప్న, పడకంటి సంతోష్, స్వప్న మడుపు, బిఎల్.గోవింద రాజులు, దుడ్డు సందీప్, మీనా శర్మ, మొహమ్మెద్ అయూబ్ లను ఎంపిక చేశారు. కార్యనిర్వాహక సభ్యులుగా జాయిద్ బిన్ హందాన్, తిప్రిక రాజ్ గగన్, ఇమ్రాన్ అహ్మద్, నేరెళ్ల సాయి కుమార్ గౌడ్, మదివర్ సాయి బసవ, అబ్దుల్ వహీద్ పాషా లను ఎంపిక చేశారు.
