30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

చిన్నారులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించడానికే ఉచిత విద్యుత్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్

 

ఎడపల్లి, బతుకమ్మ :

 

చిన్నారులకు అంగన్ వాడీ సెంటర్లో మెరుగైన వాతావరణం కల్పించడానికి విద్యుత్ సౌకర్యం లేని అంగన్ వాడీ కేంద్రాల్లో ఉచిత విద్యుత్ సరఫరాను అందజేయబోతున్నామని నిజామాబాద్ ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎడపల్లి మండల ఏఆర్పి క్యాంప్ గ్రామంలోని అంగడి బజార్, ఉర్దూ మీడియం స్కూల్ పక్కన గల అంగన్ వాడీ కేంద్రాలలో మీటర్లు అమర్చి, విద్యుత్ సరఫరా చేశారు. ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, స్థానిక సర్పంచ్ వినోద్ కుమార్ తో కలిసి మెయిన్ స్విచ్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 430 అంగన్ వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ అందచేయబోతున్నామని, ఇప్పటి వరకు 152 మీటర్లను అమర్చడం జరిగిందని తెలిపారు. దీంతో చిన్నారులకు ఉక్కపోతతో ఉపశమనం లభించనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ షేక్ బాబా, వార్డ్ సభ్యులు మహబూబ్ రంజిత్, అంగన్ వాడీ టీచర్ గాజుల రిబ్కా, సుజాత, గ్రామస్తులు, లైన్ మెన్ సాయిబాబా, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

 

Free electricity is to provide a better environment for children

More articles

Latest article