27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సమాజంలో ఐక్యత పెంపొందించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఉస్మానియా మస్జిద్‌లో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరలు హాజరై, ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొని, రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, డీఎస్పీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా కొనసాగింది.

 

Unity should be fostered in society.

More articles

Latest article