25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కల్తీ ఫుడ్ పై కంట్రోల్ ఏది ?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నాణ్యతలేని ఆహార పదార్థాల విక్రయాలు

 

. . . ప్రజల ఆరోగ్యాలతో చలగాటం

 

. . . నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై అధికారుల పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. పలురకాల మాంసాహార ఐటమ్స్‌ తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇష్టానుసారంగా నాణ్యత లేని ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలువురు మండిపడుతున్నారు.

. . . ఆహార విక్రయాలకు అనుమతి లేవి ?

ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాల బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనె, కల్తీ ఆహారాన్ని విక్రయస్తూ ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆహార పదార్థాలు విక్రయించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రత అధికారుల నుంచి పలు అనుమతులు పొందాలి. అయితే ఈ అనుమతులకు విరుద్ధంగా కొందరు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సంపాదనే ధ్యేయంగా నాణ్యత లేని పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఈ ఫాస్ట్ ఫడ్ సెంటర్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వెలువెత్తుతున్నాయి.

 

What is the control over adulterated food?

 

. . . ఆహార విక్రయ కేంద్రాలకు నిబంధనలు ఇవే

ఆహార పదార్థాలు విక్రయించే రెస్టారెంట్ లకు, భోజన హోటళ్ లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లకు, దాబాలకు, కర్రీ పాయింట్‌ లకు రిజిస్ట్రేషన్ తో పాటు, ఆహార భద్రత అధికారి నుంచి లైసెన్స్ పొందాలి. అధికారులు దాడుల్లో ఆహార విక్రయ కేంద్రాల్లో అనుమతులు లేకపోతే ముందుగా నోటీసులను జారీ చేయాలి. ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే ఆ కేంద్రాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించాలి. అంతే కాకుండా ఏడాదికొకసారి నిర్ణీత సంఖ్యలో నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించాలి. జిల్లాలోని ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలలో దీనికి భిన్నంగా కొనసాగుతుంటే అధికారులకు మాత్రం ఏమి పట్టడం లేనట్లు వ్యవహరిస్తున్నారు.

. . . ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ కరువు

రుద్రూర్ గ్రామంలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నిల్వ ఉంచిన ఆహారాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంపై దెబ్బతీస్తున్న విక్రయదారులపై అధికారులు చర్యలు శూన్యం అనిపిస్తుంది. కల్తీ ఆహారాలు విక్రయం జరగకుండా తీసుకోవాల్సిన అధికారులే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే యజమానులు మరింత రెచ్చిపోతున్నారు. ఆహార భద్రత అధికారులు ఒక్కొక్కరు వారి పరిధిలో నిర్ణీత సంఖ్యలో ప్రజలు ఉపయోగించే నిత్యవసరాల్లో వాటి నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు నమూనాలను సేకరించాలి. సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపించి వచ్చిన ఫలితాలు ఆధారంగా విక్రయదారులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

More articles

Latest article