. . . 21,60,000 జరిమానా విధించిన కోర్టులు
. . . పోలీస్ కమిషనర్ సాయిచైతన్య వెల్లడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా వ్యాప్తంగా గడిచిన వారంలో రోజుల్లో 230 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 9 నుండి 14వ తేదీ వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 230 కేసుల నమోదు చేశారు వీరిని సంబంధిత కోర్టులలో హాజరుపరచగా రూ :21,60,000 జరిమానా విధించడం జరిగిందని సీపీ తెలిపారు. వీరిలో 14 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు సక్రమంగా తమ వద్ద ఉంచుకోగలరన్నారు.
