26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 

. . . ఘనంగా ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫా పంపిణీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్‌లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందు సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున అందజేస్తున్న రంజాన్ తోఫాదుస్తుల కిట్లను అతిథులు పంపిణీ చేశారు. ​

 

The government is committed to the welfare of minorities.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ​ప్రభుత్వం మైనారిటీల కోసం విద్య, ఉపాధి రంగాల్లో అనేక పథకాలను అమలు చేస్తోందని, ​మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యానిధి వంటి సదుపాయాలను మెరుగుపరిచామన్నారు. ​ పేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం షాదీ ముబారక్పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ​వక్ఫ్ భూముల రక్షణ, ఉర్దూ భాషా వికాసానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ​ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

 

The government is committed to the welfare of minorities.

 

ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ గంగా-జమునా తెహజీబ్‌కు నిజామాబాద్ ప్రతీక అని కొనియాడారు. రంజాన్ పవిత్ర మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని, ముస్లిం సోదరులందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. పేద మైనారిటీలకు అండగా ఉండటానికే ప్రభుత్వం ఈ తోఫా కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీ సంస్థలను బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దేశ శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్థన చేశారు.

The government is committed to the welfare of minorities.

 

More articles

Latest article