25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏ ఊరు బస్టాండో ఇది..?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఈ బస్టాండుకు పేరేమిటో..?

 

. . . బస్టాండ్ పేరు తెలియక దూర ప్రాంతపు ప్రయాణికుల ఆందోళన

 

. . . బస్టాండు ప్రాంగణం పేరు రాయడం పట్ల ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం బస్టాండుకు గత కొన్ని సంవత్సరాలుగా పేరు లేకపోవడం పట్ల దూర ప్రాంతాల నుండి ఇందల్వాయి వచ్చే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇందల్వాయి టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణం చేస్తున్నప్పటికీ బస్టాండుకు పేరు లేకపోవడంతో ఇది ఏ ఊరు బస్టాండోనని ఆందోళన చెందుతున్నారు. బస్టాండ్ ప్రయాణ ప్రాంగణానికి పేరు ఉంటేనే గుర్తుతెలియని ప్రయాణిక ప్రజలు బస్టాండ్ కి రాసి ఉన్న పేరును చూసి పలాన ఊరు ఇందల్వాయి బస్టాండ్ అని తెలుసుకోవడం జరుగుతుందని, కానీ ఆర్టీసీ అధికారులు దీనికి విరుద్ధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయాణ ప్రాంగణానికి ఇందల్వాయి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం అనే పేరును ఇప్పటికీ రాయించకపోవడం విశేషం. దీంతో ఏ ఊరు బస్టాండో అనే ప్రశ్నకు ఆర్టీసీ యాజమాన్యం స్పందించి, తేరుకొని ఇందల్వాయి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి పేరు రాయాలని ప్రయాణిక ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం ఇందల్వాయి బస్టాండ్ కి పేరు రాయించడం పైన స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

More articles

Latest article