25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉపవాస దీక్షలు విరమించిన భక్తులు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మహాశివరాత్రి సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలోని వీరభద్ర స్వామి ఆలయం, భక్త మార్కండేయ ఆలయం, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా లింగంపల్లి శివాలయంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగాయి. సోమవారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాసం దీక్షలు చేపట్టిన భక్తులు ఆలయం వద్ద ఉపవాస దీక్షలను విరమించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిసార్, వార్డు మెంబర్లు రాజశేఖర్, ఆమంద్ వెంకటేష్, మహిళలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Devotees who broke their fast

More articles

Latest article