25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని వీరభద్ర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వపత్రి పూజ, మంగళ హారతులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయం వద్ద ఉపవాస దీక్ష దారులకు అన్నదాత కృష్ణ సైకిల్ స్టోర్ బోధన్ వారిచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శివ అప్ప, ఆలయ కమిటీ అధ్యక్షులు మేక వెంకటేశ్వరరావు, మహిళలు భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Special pujas at Veerabhadra Swamy Temple

More articles

Latest article