27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

క్లాసిక్ పేపర్ మిల్లులో అగ్ని ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జిల్లాలోని శ్రీనగర్ శివారులో గల క్లాసిక్ పేపర్ మిల్లు లో గురువారం మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మిల్లులో పేపరు (ముడి సరుకు) ఉంచే స్థలం నుండి మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న పేపర్ కు సంబంధించిన వస్తువులు, వాటి కోసం నిర్మించిన షెడ్లు కూడా కాలిపోయినట్లు క్లాసిక్ పేపర్ మిల్లు పర్చేస్ మేనేజర్ బల్సు శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం పోలిసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 2000 టన్నుల కన్నా ఎక్కువ ముడిసరుకు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు ఫిర్యాదు లో తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్ హెచ్ వో తెలిపారు.

 

Fire at Classic Paper Mill
Fire at Classic Paper Mill

More articles

Latest article