29 C
Hyderabad
Monday, August 3, 2026

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని పై కాసుల బాలరాజ్ దాడి చేయడం సిగ్గు చేటు..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాసుల బాలరాజ్ పై అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలి

 

. . . నల్ల బ్యాడ్జిలు ధరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో

 

. . . రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం వద్ద కాసుల బాలరాజ్ దిష్టి బొమ్మ దగ్ధం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ పై రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ దాడి చేయడం సిగ్గు చేటని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని పై దాడిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కాసుల బాలరాజ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కాసుల బాలరాజ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇందూరి చంద్రశేఖర్ తన మిత్రుడైన న్యాయవాది వెంకటరమణ రెడ్డి ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా బాన్సువాడ బస్టాండ్ సమీపంలో కాసుల బాలరాజ్ చంద్రశేఖర్ వాహనాన్ని అడ్డుకొని ఎన్నికల ప్రచారానికి వచ్చావంటూ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని గల్లా పట్టుకొని దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తాను ఎన్నికల ప్రచారానికి రాలేదని వెంకటరామణ రెడ్డి ఇంటికి వచ్చానని చెప్పినప్పటికీ చంద్రశేఖర్ పై అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారన్నారు.

 

It is shameful that Kasula Balaraj attacked the Black Congress president.

అనంతరం ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తన మిత్రుడైన వెంకటరమణ రెడ్డి ఇంటి భోజనానికి వెళ్లి తిరిగి రుద్రూర్ కు వస్తుండగా తన కారుని అడ్డుకొని కాసుల బాలరాజ్ తనపై దాడికి పాల్పడడమే కాకుండా, కాసుల బాలరాజ్ తన జేబులో నుంచి 50 వేల రూపాయలు తన చేతుల్లో పెట్టి తాను ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆయన వద్ద ఉన్న డబ్బులు తన చేతిలో పెట్టి తానే డబ్బులు పంచుతున్నట్లు చేయడానికి వచ్చినట్లు కాసుల బాలరాజ్ తనపై దాడికి పాల్పడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో తన అధికార బలంతో నిర్బంధించారని చంద్రశేఖర్ తీవ్రంగా ఆరోపించారు. తనపై దాడికి పాల్పడ్డ కాసుల బాలరాజు పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం వెంటనే కాసుల బాలరాజ్ పై చర్యలు తీసుకోని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు, వివిధ మండలాల, గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

It is shameful that Kasula Balaraj attacked the Black Congress president.

More articles

Latest article