. . . ఆర్మూర్ పట్టణంలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన పోలీసు కమిషనర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రాంతంలోని వివిధ పోలింగ్ బూత్ ల నుంచి వచ్చేటటువంటి బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ పోలిస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పిప్రి రోడ్డు లో గల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఆయన మంగళవారం క్షుణ్ణంగా పర్యవేక్షించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ పి. సత్యనారాయణ, ఎన్నికల పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.

