. . . నిజామాబాద్ పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎన్నికల సిబ్బంది విధుల పట్ల ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించరాదని, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి మంగళవారం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బంధుప్రీతికి ఆస్కారం ఇవ్వకూడదని, ఓటు హక్కు వినియోగించుకొనే ఓటర్లతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని, ఎవరికి ఎలాంటి సమాచారం తెలిసిన తమ పై అధికారులకు హుటాహుటన తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసిపి బి ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, సిఐడి ఏసిపి రాజా వెంకటరెడ్డి, రామకృష్ణ, బందోబస్తు నిర్వహణ కోసం వచ్చినటువంటి సిఐలు, ఎస్సైలు, టి ఎస్ ఎస్ పి ప్లాటు సిబ్బంది, ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బంది, ఇన్. సి.సి క్యాడేట్లు తదితరులు పాల్గొన్నారు.
