30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ధన్ పాల్ నీకు దమ్ముంటే ప్రెస్ క్లబ్ లో డిబేట్ కి రా…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయని నీకు మాట్లాడే హక్కు లేదు

 

. . . మాట్లాడే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడు

 

. . . నీ చేతగానితనంతో నగరం అభివృద్ధికి నోచుకోలేక .. అంధకారంలోకి వెళ్ళింది.

 

. . . నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరాన్ని అంధకారంలోకి తీసుకువచ్చారని, నాయకుడు అంటే నగర అభివృద్ధి చేసి ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉండాలని, నగరంలో చేసిన అభివృద్ధి పై ప్రెస్ క్లబ్ లో డిబేట్ పెడతా దమ్ముంటే రా.. డేట్ కుడా నువ్వే ఫిక్స్ చేసుకో.. అని నిజామాబాద్ మాజీ అర్బన్ శాసనసభ్యులు గణేష్ బిగాల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు నగర అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని, వారికి ఎలా ఓటు వేస్తారు ఒక సారి ఆలోచించండని ఆయనన్నారు. నా సొంత డబ్బులతో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులతో పాటు వధూవరులకు అన్నగా నేను బట్టలు పెట్టడం జరిగిందని, మరి ప్రస్తుత అర్బన్ ఎమ్మెల్యే కు 10 బట్టల దుకాణాలు ఉన్నాయి ఎవరికైనా బట్టలు పెట్టాడా అని, నీ ట్రస్టు ద్వారా నగర అభివృద్ధి చేస్తానని చెప్పావు, ఇప్పుడు ఎందుకు చేయడం లేదు, వ్యాపారాలు చేసుకోవడానికే ఎమ్మెల్యే అయ్యావా అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ఇచ్చిన నిధులతో 60 నుంచి 70 కార్యాలయాలు ఒకే వేదికపై ఉండే విధంగా నూతన కలెక్టరేట్ ను నిర్మించడం జరిగిందని, ఆనాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నూతన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని, ప్రజలు సేద తీర్చుకునేందుకు మినీ ట్యాంక్ బండ్ నిర్మించడం జరిగిందని, ఆర్మూర్ రోడ్, బోధన్ రోడ్, వర్ని రోడ్ నిర్మాణాలు చేసుకొని పూర్తి చేసుకున్నామని, సెంటర్ మీడియన్ పనులు చేసి విద్యుత్ అలంకరణతో సుందరీ కరణంగా చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ నగర జనాభాను అంచనా వేసి నీటి వసతి కల్పించడం జరిగిందని, బైపాస్ రోడ్డు పూర్తి చేసిన ఘనత కుడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. అలాగే రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేసిందో చెప్పాలని అన్నారు. నగరంలో బిజెపి ఎమ్మెల్యే ఉన్నాడని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వద్దకు పంపించే పరిస్థితి ఏర్పడిందని, ఒక వేళ ఎమ్మెల్యే వద్దకు వెళ్తే నేను అధికారం లో లేను నాతో ఏం కాదంటున్నాడని ఎద్దేవా చేశారు. కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పిన ప్రభుత్వానికి, రూ. 2000 ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాని కంటే రూ.4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తారా అని ఆయనన్నారు. ధన్ పాల్ సూర్యనారాయణ గెలిస్తే ప్రభుత్వం ద్వారా నిధులు రాకపోతే నా ట్రస్టు ద్వారా అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగిందని, ఇప్పుడు నీ ట్రస్టు ఎటు పోయిందని, అభివృద్ధి చేయడానికి చేతకాదు కానీ, చేసిన వాళ్ల మీద నిందలు వేస్తావు అంటూ మండిపడ్డారు. ధన్ పాల్ సూర్యనారాయణ మేయర్ ని చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గెలిచి మీరు చేసింది ఏమీ లేదు మేయర్ గా గెలిచి ఏమి చేస్తారు అని ప్రశ్నించారు. ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని, బీజేపీ నాయకులు చేసిన అరాచకాల వల్ల ఒక కుటుంబం కృష్ణానదిలో, బాసరలో దూకి మరణించారని అన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసిన గొప్ప మనసు మాదని, అన్ని పార్టీలకు సమాన నిధులతో ఒకేలాగ పనిచేయడం జరిగిందన్నారు. 2009 లో ఎంపీగా పోటీ చేస్తే ఆయన మీద నేను పోటీ చేసానని, కానీ మధు యాష్కి గౌడ్ ఒక్కరోజు కూడా నా గురించి మాట్లాడలేదని, లక్ష్మీనారాయణ పోటీ చేసిన నా గురించి మాట్లాడలేదని, ఎందుకంటే 50 సంవత్సరాల చరిత్ర తిరగరాసి అభివృద్ధి చేసినందుకే మాట్లాడలేదని ఆయనన్నారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయడం జరిగిందని, మోడ్రన్ స్మశాన వాటికలు నిర్మించడం జరిగిందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, ప్రజలందరూ బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ దండు నీతు కిరణ్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజాత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, జగత్ రెడ్డి, డాక్టర్ రుషిత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article