29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆన్ లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలి

Must read

📰 Generate e-Paper Clip

 . ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులు, కొడుకు

. నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన

ఎడపల్లి, బతుకమ్మ:  ఆన్ లైన్ బెట్టింగ్ కు ఒక కుటుంబం బలైంది. కోడుకు చెసిన అప్పులకు తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన దంపతులు రంగన్వేని సురేశ్(53), హేమలత(45) కుమారుడు హరీశ్(22) బెట్టింగ్ లకు అలవాటు పడి అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఉన్న పొలాన్ని సైతం అమ్మేశాడు. అయినప్పటికీ రూ.18లక్షల అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేశ్, హేమలత, హరీశ్ శుక్రవారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది.

More articles

Latest article