విద్యుత్ ఉద్యోగుల చికిత్స పట్నంలోనా..

0 3,800
  • సర్కిల్ సర్కిల్ హద్దుకు బదిలీనే..
  • మానవీయ కోణంలో సీఎండీ దృష్టి
  • తప్పుడు పత్రాలు జోడిస్తే చర్యలే

నిజామాబాద్, బతుకమ్మ : చాలా ఏళ్లుగా పట్నంలో చికిత్స పొందుతున్న విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఊరట లభించేలా కంపెనీ సీఎండీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం పలుమార్లు హైదరాబాద్ తిరుగుతున్న వారికి సర్కిల్ పరిధిలోని సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వాలని మానవీయకోణంలో ఆలోచిస్తున్నారని సమాచారం. ఇదే అమలయితే ఏళ్ల తరబడి చికిత్స తీసుకుంటున్నవారికి దూర భారం నుంచి ఉపశమనం పొందనున్నారు.

పట్నంలో చికిత్సనా..

దేహంలోని కొన్ని ముఖ్యమైన భాగాలకు నిజామాబాద్ సర్కిల్ పరిధిలో చికిత్స చేయించుకోవడానికి సరైన ఆసుపత్రుల సౌకర్యం లేదు. దీనివల్ల పట్నంలోని ప్రధాన దవాఖానాలో చికిత్స చేయించుకోవడానికి వెళ్తున్నారు. గుండె ఆపరేషన్లు, క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధులకు అక్కడే వ్యాధి నయమయ్యేలా చూపించుకుంటున్నారు. దీనికోసం వైద్యుని సూచనలు మేరకు ప్రతి నెల వెళ్లి రావాల్సి ఉంటుంది.

సీఎండీ దృష్టి..

ఎన్పీడీసీఎల్ లో ఉద్యోగులందరితో పని చేయించుకోవడమే కాకుండా వారి యోగక్షేమల పైన దృష్టి సారించాల్సి ఉంటుందని కంపెనీ సీఎండీ గ్రహించారు. పనిచేసే ప్రాంతం నుంచి వేరే జిల్లాలో చికిత్స పొందుతున్న వారి సమస్యను కొంతైనా తీర్చాలని మానవత దృక్పథంతో ఆలోచించారు. ఏళ్ల తరబడిగా పట్నం తిరుగుతున్న వారికి నిజామాబాద్ సర్కిల్ లోని సరిహద్దుకు బదిలీ చేయాలని నిశ్చయించారు. దీనివల్ల వారికి సుమారు సగం దూర భారమైన తగ్గడంతో అనారాగ్య బాధితులకు కాస్త అలసట తగ్గనుంది.

తప్పుడు పత్రాలిస్తే చర్యలే..

వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నామని, తప్పుడు పత్రాలు జోడించి బదిలీ కాకుండా చేసుకోవాలని చూస్తే సీఎండీ కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలిసింది. అనారోగ్యం పేరిట కేంద్రంలో ఉంటున్న వారి జాబితాలను ముందస్తుగా పరిశీలించాకే రోగుల పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కాన్సర్ రోగికి మేలు..

సుమారు 30 ఏళ్లుగా అంటే పోస్టింగ్ లో నియామకం నుంచి ఇప్పటివరకు పవర్ హౌస్ ను ఒక మహిళా ఉద్యోగి వీడలేదు. విధి వక్రీంచిందేమో కాబోలు ఆమె కాన్సర్ బారిన పడ్డారు. గత కొన్నేళ్లుగా పట్నంలో చికిత్స పొందుతున్నానని ఆసుపత్రి పత్రాలు జోడిస్తూ ఇక్కడే ఉంటున్నారు. సీఎండీ నిర్ణయంతో కామారెడ్డి జిల్లా ప్రాంతానికి బదిలీ చేస్తే పట్టణం నుంచి రాకపోకల భారం తగ్గనుంది.
ఇలాంటి వారితో పాటు గుండె, కిడ్నీ ఇతర వ్యాధులతో చికిత్స చేయించుకునేవారు ఈ సారి హైదరాబాద్ కు సమీపమైన కామారెడ్డి జిల్లాకు బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. రోగుల పట్ల మానవీయ దృక్పతాన్ని చూపిస్తున్న కంపెనీ సీఎండీ వరుణ్ రెడ్డి ని ఉద్యోగులు అభినందనలతో ముంచేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.