29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గ్రామపంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వీడాలి

Must read

📰 Generate e-Paper Clip

పోతంగల్,  బతుకమ్మ :  పోతంగల్ మండలంలోని  జలపల్లి ఫారం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, బకాయి ఉన్న నెలసరి జీతం వెంటనే ఇవ్వాలని సామాజిక సేవా కార్యకర్త మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ఎంఎ హకీమ్ అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు దసరా కానుకగా శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు సుమారు నాలుగు నెలల నుంచి జీతం వస్తలేదని అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వీడి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు 24 గంటల పాటు కష్టపడితే వారి జీతాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికుల పట్ల ప్రభుత్వానికి వివక్ష ఎందుకని విమర్శించారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి నెలసరి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు నాయకులు మాజీ సర్పంచ్ సేరు, దేవ్ సింగ్, మాజీ ఎంపీటీసీ రాములు. సజ్జత్ తదితరులు ఉన్నారు.

Gram panchayat workers should be neglected

More articles

Latest article