29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్,  బతుకమ్మ : గురువారం రాత్రి కురిసిన వర్షానికి బోధన్ మండలంలోని అమ్ధాపూర్, ఊట్ పల్లి, బెల్లల్, రాజీవ్ నగర్ తండా, సంగం, చుట్టు పక్కల గ్రామాలలో వరిపంట పూర్తిగ నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేను, ఇరవై రోజులలో కోత కోసే ఈ సమయంలో ఇలా భారీ గాలి వీచి, వర్షం కురిసి పంట పూర్తి గా నీట మునిగి పోవడం తో రైతులు నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కున్నట్టు అయిందని రైతులు తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్,జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.

Compensation should be paid to the affected farmers

More articles

Latest article