రుద్రూర్, బతుకమ్మ :
వసంత పంచమిని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గల సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. షికారి శివ, వంజరి గణేష్, ఎం.వి. గంగారాం, సంతోష్ ల సహకారంతో బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా శ్రీ వాణి సాహితి విద్యానికేతన్ విద్యార్థులకు బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వర్ అప్ప, యువరాజ్ అప్ప, ఆలయ కమిటీ అధ్యక్షులు కటికే రామ్ రాజ్, శ్రీ వాణి సాహితి విద్యానికేతన్ ప్రిన్సిపల్ లోగం నాగరాజు, లోగం సరస్వతి, ఉపాధ్యాయురాలి బృందం, విద్యార్థులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

