24 C
Hyderabad
Sunday, August 2, 2026

మన ఇందూర్… మన మేయర్…

Must read

📰 Generate e-Paper Clip

. . . బల్ధియా పై బిజేపి కొత్త నినాదం

 

. . . నిజామాబాద్ పేరు మార్పిడి టార్గెట్

 

. . . బల్ధియా ఎన్నికల్లో కమలం కు పవర్ ఫుల్ ప్రచారాస్త్రం 

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

నిజామాబాద్ మేయర్ స్థానం టార్గెట్ గా బిజేపి ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు అందనంతగా ముందుగానే ప్రచారాస్త్రం ఎక్కు పెట్టింది. అదే మన ఇందూర్- మన మేయర్.. ఇప్పుడు అదే బిజేపి ప్రధాన ప్రచారాస్త్రం. సోషల్ మీడియా మొదలుకొని.. గోడలపై రాతలో కమలం పార్టీ నగరంను ముంచెత్తుతుంది. అన్ని రాజకీయ పార్టిలు బల్ధియా ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలని తలలు పట్టుకుంటుండగా కాషాయ పార్టీ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో మన  ఇందూర్- మన మేయర్ సిద్ధాంతంను ఎత్తుకుంది. అభ్యర్థుల ఖరారు కాలేదు.. కార్పొరేటర్  టికెట్ వస్తుందో రాదో తెలియదు కానీ నగరంలోని పువ్వు పార్టీ ఇప్పుడు మన ఇందూర్- మన మేయర్ అనే ఫీవర్ ఆవహించింది. వారు సోషల్మీడియాలో అదే నినాదంతో ప్రజల్లోకి పోకస్ చేస్తుండగా.. మరి కొందరు గల్లి లో, కాలనీలలో గోడలను మన మేయర్- మన ఇందూర్ అనే సిద్ధాంతం రాతలతో గోడలు నింపుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యం అని అధికార ప్రతిపక్షాలు సేద తీరుతుంటే మేయర్ పీఠం లక్ష్యం చేసుకున్న బీజేపీ ఎలాగైనా నగర పాలక సంస్థ పై జెండా ఎగురవేయడం ధ్యేయంగా పావులు కదుపుతుంది.. భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలు కలిగిన పార్టీ. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ప్రకారం ఓట్లు అడగడం ఎన్నికల బరిలో నిలుచుండడం ఆ పార్టికే చెల్లుతుంది. పార్టీ స్థాపించింది మొదలు ఆనాటి రామ జన్మభూమి అయితే నేమి… నేటి డెవలప్మెంట్ పేరిట జరుగుతున్న ప్రచారాన్ని దేనినైనా ప్రచారం చేసుకోవడం దానికే చెల్లింది. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా పేరున్న బిజెపి మున్సిపల్ ఎన్నికలకు వచ్చే సరికి స్థానిక సమస్యలను ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. నిజామాబాద్ నగర పాలక సంస్థ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటానికి ప్రధాన కారణం నిరంకుశ ‘నిజాం’ పాలన అని చెప్పేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఉమ్మడి జిల్లా వంద సంవత్సరాల క్రితం ఏర్పడగా ‘నిజాం‘ పేరు కారణంగా నిజాం సాగర్వట్టి పోయింది, నిజాం షుగర్ మూతపడింది, నిజామాబాద్ డెవలప్మెంట్ అటకెక్కిందని కమలం పార్టీ నాయకులు నమ్ముతున్నారు. ఇటీవల కాలంలో బిజెపి ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన చాలా ప్రాంతాలలో విదేశీ పాలకుల పేర్ల మీద ఉన్న జిల్లాల పేర్లు, పథకాలకు ఉన్న ఇతర పేర్లు మార్పిడి చేసింది. అది విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో దాని దృష్టి నిజామాబాద్ పేరుపై పడింది… నిజామాబాద్ ను ఒకప్పుడు ఇందూర్ గా, ఇంద్రపూరి గా పిలిచేవారు. పూర్వ కాలంలో ఇంద్ర దత్తుడు అనే రాజు ఈ నగరం  రాజధానిగా చేసుకుని పాలించడంతో ఇందూర్ గా పిలిచేవారు. ఇప్పటికే నాటి నిజాం పాలన సాగిన గ్రామాలతో పాటు పొరుగు ప్రాంతంలో నిజామాబాద్ బదులు చాలా మంది ఇందూర్ గానే పిలుస్తారు. ఆరవ నిజాం పాలనలో ఇందూర్ పేరును మార్చి నిజామాబాద్ గా నామకరణం చేశారు. వందేళ్ళ చరిత్ర కలిగిన నగరం మాత్రం మున్సిపాల్టి నుంచి నగర పాలక సంస్థ పేరు మారిన అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో నిలిచింది. ఇతర ప్రాంతాల్లో నిరంకుశ పాలకుల పేర్లు తోలిగించినట్టు గానే నిజామాబాద్ పేరును తొలగించి గత బల్దియా ఎన్నికలకు ముందు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ బిజెపి గెలిస్తే ఇందూర్ గా మారుస్తామని హమీ ఇచ్చారు. ఆనాడు 60 డివిజన్కు గాను 28 డివిజన్ లను గెలిచిన కాషాయ పార్టీ బల్దియాలో అతిపెద్ద పార్టిగా మిగిలింది కానీ, మేయర్ పీఠం దక్కించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపాలిటీ ని ప్రత్యక్ష ఎన్నికల్లో రెండు పర్యాయాలు గెలిచింది. కానీ నగర పాలక సంస్థగా మారినప్పటి నుంచి మేయర్ పీఠం కోసం బిజేపి దండయాత్ర చేస్తునే ఉంది. ఈ సారి బిజేపి బల్ధియాపీఠం అధిరోహిస్తూ మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల జనరల్ బాడీ సమావేశంలో నిజామాబాద్ పేరును ఇందూర్ మార్పిడి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని బిజెపి ఎంపి అర్వింద్ ధర్మపురి ప్రచారం ప్రారంభించారు. దానితో కమలం పార్టీ బల్ధియా ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా నిజామాబాద్ పేరును ఇందూర్ గా మార్చడం అన్న లక్ష్యంగా ముందుకు కదులుతుంది. అది మున్సిపల్ ఎన్నికలకు వెలుతుండగా ఫలితాల సంగతి దేవుడు ఎరుగు కానీ ఇప్పుడు అంతా మన ఇందూర్- మన మేయర్ అనే ప్రచారంతో అంత మారుమ్రోగుతుంది.

 

 

Our Indore... Our Mayor...

 

our indore... our mayor

More articles

Latest article