27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపు భీంగల్ కు మంత్రి సీతక్క

Must read

📰 Generate e-Paper Clip

. . . పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి

 

భీంగల్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క రేపు భీంగల్ పట్టణం కు రానున్నట్లు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి తెలిపారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి సీతక్క భీమ్‌గల్ మున్సిపాలిటీలో రూ.11.5 కోట్లు టీయుఎఫ్ఐడీసీ నిధులతో, రూ.25 కోట్లు అమృత్ 2.0, రూ.15 కోట్ల నిధులతో పలు నగర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. వీటితో పాటు మెండోరా నుండి నర్సాపూర్ గ్రామం వరకు రూ.1.85 కోట్ల సీఆర్ ఆర్ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. కావున మంత్రికి ఘన స్వాగతం పలికెందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మెండోర ఉప సర్పంచ్ రమేష్, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు నాగేంద్ర, ఎస్సి సెల్ అధ్యక్షుడు అనంతరావు, మండల మహిళ అధ్యక్షురాలు కల్పన, నాయకులు వాక మహేష్, సంగ్య నాయక్, సేవలాల్, జేమ్స్, రాజరెడ్డి, బొదిరె నాగమణి, గంగమణి, సాయమ్మ, యకమ్మ, మోహన్, డాకర్ స్వామి. వసంత్ రాజు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article