28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో – బేటి పడావో కార్యక్రమంలో భాగంగా యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా–శిశు–వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మంగళవారం రోజు అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని నాగారం తెలంగాణ మైనారిటీ రెసిడెన్సల్ బాయ్స్ స్కూల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ కవిత, ఫైనాన్స్ లిట్రసి పుష్ప పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బేటి బచావో – బేటి పడావో కార్యక్రమ లక్ష్యాలను వివరించి, లింగ వివక్షత నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఏఆర్ ఎడ్యుకేషన్ ట్రైనర్ శిరీష మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న లింగ వివక్షత అంశాలను ఉదాహరణలతో వివరించి, యువ కిశోర బాలురలో లింగ సమానత్వంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బాలురు –బాలికల మధ్య సమాన హక్కులు, గౌరవం, పరస్పర అవగాహన గురించి వివరించడంతో పాటు, మహిళలు, బాలికలపై వివక్ష, హింసను నివారించడంలో బాలుర పాత్ర ఎంతో ముఖ్యమని తెలియజేశారు. అలాగే బాల్యవివాహాలు, బాలలపై దుర్వినియోగం వంటి సామాజిక సమస్యలపై చర్చించి, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో యువత బాధ్యతను గుర్తు చేశారు. ఈ శిక్షణ ద్వారా యువ కిశోర బాలురలో సానుకూల దృక్పథం పెరిగి, లింగ సమానత్వాన్ని పాటించి సమాజ నిర్మాణానికి వారు తోడ్పడతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్స్, విద్యార్థులు, డీహెచ్ఈడబ్యూ సిబ్బంది పుష్ప, కవిత ఐసిడిఎస్ సూపర్వైజర్ ఫర్హాత్ మేడం పాల్గొన్నారు.

More articles

Latest article