25.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

బీఆర్ఎస్ లో చేరిన భీంగల్ కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ :

 

భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వీడీసీ ప్రెసిడెంట్ నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేవ్వఅశోక్, కర్నె నరేష్ లు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లోని తన నివాసంలో వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భీంగల్ పట్టణ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమని బీఆర్ ఎస్ లో చేరినట్లు తెలిపారు. గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే తాము కాంగ్రెస్ పార్టీని వీడి, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొన్కంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసి చౌటపల్లి రవి, మాజీ కౌన్సిలర్ బోదిరే నర్సయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Bheengal Congress leaders join BRS
Bheengal Congress leaders join BRS

More articles

Latest article