29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్నికలు సజావుగా జరుగడానికి సహకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . రాజకీయ పార్టీల నాయకులతో మున్సిపల్ కమిషనర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

 

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా జరుగడానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. శనివారం మున్సిపాల్ కార్పొరేషన్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు వెల్లడించారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదిస్తామని కమిషనర్ తదుపరి అదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయా పార్టీల ప్రతినిధులకు తెలిపారు.ఈ సమావేశంలోఅడిషనల్ కమిషనర్ రవీంధర్ రావు, పార్టీల నాయకులు బొబ్బిలి రామకృష్ణ, సిర్ప రాజు, పోతన్ కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ళ లక్ష్మీనారాయణ, కటారి రాములు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, తదితరులున్నారు.

More articles

Latest article