30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. ప్రజల గొంతుక

Must read

📰 Generate e-Paper Clip

సూర్యాపేట, బతుకమ్మ :  ప్రతిపక్షం అంటే పార్టీ మాత్రమే కాదని,  ప్రజల గొంతుక అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత  అన్నారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ జాగృతి బాట లో కవిత మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్ రావు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కీలక అంశంపై చర్చ జరుగుతుంటే సభలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం లేదా? ,  హరీశ్ రావుని సీఎం రేవంత్ వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నందుకు సభని బాయ్ కాట్ చేస్తారా?  అని ప్రశ్నించారు.  కేసీఆర్ ని సీఎం రేవంత్ ఎన్ని తిట్లు తిట్టారు..? హరీశ్ రావు ఎప్పుడైనా బాయ్ కాట్ చేశాడా? అని నిలదీశారు.  గుంటనక్క హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని చెప్పాను అని గుర్తు చేశారు.  కృష్ణా జలాల పంపకాల్లో హక్కులు తగ్గించి హరీశ్  రావు సంతకం పెట్టారా లేదా? ప్రశ్నించారు. జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చడానికి కారణమేంటి? అని అడిగారు. కేవలం హరీశ్ రావు ధన దాహం కోసమే మార్చారని, హరీశ్ నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు.  అసెంబ్లీలో కేసీఆర్ తప్పు చేశాడనే వాదన తప్ప కృష్ణా నది నీటి వాటాపై చర్చలేదని కవిత విమర్శించారు. కర్నాటక ప్రభుత్వం అల్మటి ప్రాజెక్టు ఎత్తు పెంచి 100 టీఎంసీల నీటిని తెలంగాణ నష్టపోయే పరిస్థితి ఏర్పడిన ప్రశ్నించకుండా ఉత్తరం రాసి వదిలేశారని మండిపడ్డారు. జగదీశ్ రెడ్డి దత్తత తీసుకున్న చీదేళ్ల గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. చివ్వేంల మండలం ఉండ్రుగొండలో జగదీశ్ రెడ్డి అనుచరులు ఆరు ఎకరాల భూమి కబ్జా చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగారం సర్పంచ్ ఎన్నికల్లో ఓటు కు రూ. 10 వేలు ఇచ్చి తండ్రిని  జగదీశ్ రెడ్డి గెలుపించుకున్నారని ఆరోపణలు చేశారు.

More articles

Latest article