24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బగ్గలి స్వప్నకు సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారం 

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : 

 

సావిత్రిబాయి పూలే 195వ జన్మదినోత్సవం సందర్బంగా రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలు 2026వ సంవత్సరంకు గాను జనవరి 3న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బగ్గలి స్వప్నకు సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారం ప్రధానం చేశారు. సావిత్రిబాయి పూలే 195వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్సవ కమిటీ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వినతులను స్వీకరించారు. వివిధ రంగాలకు చెందిన మహిళలు తమ వృత్తి లో ప్రతిభను కనపరిచినటువంటి వారికి ప్రతిభ పురస్కారాలను అందజేశారు.అందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన రజక కుల వృత్తిలో వారు చేస్తున్నటువంటి సేవలకు గాను బగ్గలి స్వప్నకు, వ్యాపార రంగంలో రాణిస్తున్నసురుకుట్ల ఝాన్సీలు ఇరువురికి ఉత్తమ ప్రతిభ పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో వారికి అందజేశారు. ఈ సందర్భంగా బగ్గలి స్వప్న మాట్లాడుతూ రజక కుల వృత్తిలో తమను గుర్తించి ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article