. . . ఆర్టీసీ 1 డిపోలో మెకానిక్ ల నిర్వాకం
. . . అధికారులు అనుమతి ఎలా ఇచ్చారు?
. . . కరీంనగర్ విజిలెన్స్ కు ఫిర్యాదులు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 1వ ఆర్టీసీ డిపోలో జంతుబలి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జంతువధ నిషేదం ఉండగా కొందరు మెకానిక్ లు గత నెల 31 తెల్లవారుజామున డిపోలో మేకను కోసి విందు చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సంబంధిత మెకానిక్ లు డిపో అధికారుల అనుమతి ఇచ్చారని గుట్టుచప్పుడు కాకుండా గత నెల 31 తెల్లవారుజామున 3 నుంచి 3.30 గంటల మధ్య మేకను వధించి ఆటోలో దానిని బైపాస్ రోడ్డుకు తరలించి మద్యంతో విందు చేసుకున్నట్లు కొందరి కరీంనగర్ లోని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సంబంధిత మేకను వధించి తరలించే వీడియో ఫ్రూప్ గా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
రవాణా శాఖ డిపోలలో జంతు నిషేదం కొనసాగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం హయంలో ఆర్టీసీ డిపోలలో జంతుబలిని నిషేదించారు. ప్రధానంగా ఆర్టీసీలో విధులు నిర్వహించే డ్రైవర్లు,మెకానిక్ లు జంతుబలి తర్వాత విందులు చేసుకుంటే మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమౌతారని జంతుబలిని నిషేదించారు. దానిని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు.కోందరు డిపో అధికారులు తాత్కలిక డ్రైవర్ ల పాలిట చండా శాసనులుగా పనిచేయిస్తున్నారు. చిన్న తప్పిదాలకు పెద్ధ శిక్షలు విధిస్తు, ఎకంగా విధుల నుంచి తోలిగిస్తున్నారు. కాని వారు మాత్ర నిబంధనలకు విరుద్ధంగా జంతు బలి నిర్వహణకు అనుమతిని ఇవ్వడంపై, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ఉత్కంఠ అర్టిసీ ఉద్యోగులలో నెలకోంది.
గత నెల 13న డిపోకు చెందిన కొందరు సిబ్బంది విందు చేసుకోవాలని సంకల్పించారు. అయితే మేకను కోసుకుని విందు చేసుకోవాలనుకున్నవిషయం బహిర్గతం కావడంతో దానిని విరమించుకున్నారు. సంబంధిత డిపోలో ఒక అధికారి వ్యవహరిస్తున్న తీరు పట్ల సిబ్బంది గుర్రుగా ఉన్నారు. ప్రధానంగా డ్రైవర్లు అయితే అతని బాధితుడిగా చెబుతున్నారు. సంబంధిత అధికారి మరికొన్ని రోజుల్లో పదవి విరమణ చేయనుండగా అతని ప్రోత్సహంతోనే విందుకు సన్నాహాలు చేసినట్లు తెలిసింది. డిపోలో అధికారులే పర్మిషన్ ఇచ్చారని తెగింపుతో రాత్రికి రాత్రే మెకానిక్ లు డిపోలో మేకను కోసి విందు చేసుకున్న వ్యవహరం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీలో ఉన్న జంతువధ నిషేదాన్ని కాలరాస్తూ డిపోలోనే అంచెలంచెలుగా ఎదిగిన అధికారి మన్ననలు పొందేందుకు మెకానిక్ లు చేసిన దుస్సాహాసంపై చర్చలు జరుగుతున్నాయి. స్థానికంగా ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోరని కరీంనగర్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ఖాయమని చెబుతున్నారు. నిషేధం ఉల్లంఘనలను చేయడానికి కారకులైన డిపో అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెచి చూడాలి.
