27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మెడికో విద్యార్థిని బంగారు గొలుసు సెల్ ఫోన్ లాక్కున్న ఖాకీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏకాంతంగా మాట్లాడుతుండటమే తప్పు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో మెడికో విద్యార్థులు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుతుండగా మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వారిని బెదిరించి బంగారు గొలుసు, ఐఫోన్ లాక్కున్నాడు. ఈ సంఘటన గత నెల చివరి వారంలో కేఫ్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో జరిగింది. నగరంలో వైద్య విద్య మూడవ సంవత్సరంను అభ్యసిస్తున్న ఓ విద్యార్థి  తోటి విద్యార్థినితో కలిసి మాట్లాడుతుండగా రాత్రివేళ విధులు నిర్వహిస్తున్న స్థానిక కానిస్టేబుల్ ఒకరు వారిని బెదిరించి బంగారు గొలుసు, ఐఫోన్ లాక్కున్నాడు. ఈ విషయంపై బాధితులు మరునాడు స్థానికంగా కొందరికి విషయం తెలుపడంతో వారు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో కానిస్టేబుల్ జంట పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అగంతకుల మాధిరిగా ఖరీదైన సెల్ ఫోన్ తో పాటు బంగారు గొలుసును లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యవహరాన్ని బయటకు పొక్కనీయకుండా సెల్ ఫోన్ ను, బంగారు చైన్ ను కానిస్టేబుల్ నుంచి తిరిగి ఇప్పించినట్లు తెలిసింది. జంటల నుంచి అగంతకులు పోకిరిల మాదిరిగా పోలీసు కానిస్టేబుల్ బంగారు గొలుసు, ఐఫోన్ లాక్కుంటే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తప్పించడం ఏమిటని చర్చ జరుగుతుంది. పోలిస్ అధికారులు కానిస్టెబుల్ ను కాపాడటం ఎమిటనే పలువురు చర్చించుకుంటున్నారు.

 

More articles

Latest article