24.1 C
Hyderabad
Monday, August 3, 2026

పార్కింగ్ విషయంలో గొడవ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యుత్ ఉద్యోగిపై దాడి

. . . కేసు నమోదు చేసిన పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలోని పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం 3వ టౌన్ పరిధిలోని రఫిక్ అనే వ్యక్తి ఇంటి ప్రక్కన మహమూద్ హోటల్ నిర్వహిస్తున్నాడు. తన ఇంటి ముందు ఇతరుల వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈ విషయంలో రఫిక్ అతని కొడుకు షోయాబ్ లు హోటల్ యజమాని మహమూద్ ను ప్రశ్నించారు. దానితో అతడు మరికొందరితో కలిసి రఫిక్, షోయాబ్ లపై దాడి చేసి కొట్టారు. ఈ ఘటనలో తండ్రి కొడుకులకు గాయాలయ్యాయి. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ఈ కేసును కాకుండా కోందరు దళారులు రంగ ప్రవేశం చేసి కాసులతో బేరసారాలు సాగించినట్టు విశ్వసనీయ సమాచారం. పోలిస్ స్టేషన్ ప్రాంగణంలోనే రాజీ కోసం బెదిరింపులకు దిగినట్టు బాధితులు తెలిపారు.

More articles

Latest article