26.6 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులుగా పల్నాటి కార్తీక్ 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

నిజామాబాద్ జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులుగా పల్నాటి కార్తీక్ ను ఎన్నుకున్నారు మంగళవారం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మైసాల నారాయణ, ప్రధాన కార్యదర్శి బొడ్డు గంగ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా యువజన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా పల్నాటి కార్తీక్, ప్రధాన కార్యదర్శిగా గజం అభిలాష్, జిల్లా కోశాధికారిగా గెంట్యాల అజయ్ ల ను నియమించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నూతనంగా ఎంపిక చేయబడిన జిల్లా యువజన కార్యవర్గాన్ని జిల్లా కమిటీ ఘనంగా సన్మానించి సత్కరించింది. జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడిగా ఎంపికైన పల్నాటి కార్తీక్ ప్రస్తుతం బీజేవైఎం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. తనను నియమించిన జిల్లా పద్మశాలి సంఘం కార్యవర్గానికి పల్నాటి కార్తీక్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పద్మశాలి యువజన సంఘం లో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు దాసరి నర్సింలు సలహాదారులు గెంటియాల వెంకటేష్, కార్యవర్గ సభ్యులు బాబురావు, చింతకింది సంతోష్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article