. . .గ్రౌండ్ కోసం చెరువు తూము ఎత్తారని రైతుల ఆందోళన..
కోటగిరి, బతుకమ్మ :
చెరువు తూము అధికారులు మంగళవారం ఎత్తడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని దా మరి చెరువు సంబంధించిన తూమును అధికారులు సోమవారం తెరవడంతో చెరువు ఆయకట్టు కింద గల వ్యవసాయ భూమిలో నీరు చేరడంతో నారుమడులు నీట మునిగాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 26,27 వ తేదీల్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయగా క్రికెట్ గ్రౌండ్ కోసం ఇరిగేషన్ అధికారుల సహకారంతో కావాలని చెరువులో నీటిని తగ్గించడం కోసం తూము తెరవడంతో తమ వ్యవసాయ భూములన్ని నీటములు గాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఆర్భాటాల కోసం ఏర్పాటు చేసే పోటీల కోసం రైతులకు నష్టం కలుగుతుందని తెలిసినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం రాజకీయాలకు తలొగ్గి వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దా మరి చెరువు తూము తెరవడం వాస్తవమే… – ఇరిగేషన్ ఏఈ సత్యనారాయణ
ఇరిగేషన్ ఏఈ సత్యనారాయణ కు బతుకమ్మ ప్రతినిధి ఫోన్ ద్వారా వివరణ కోరగా దా మరి చెరువు తూము ఎత్తిన మాట వాస్తవమేనని నిజాంసాగర్ కాలువ నీళ్లు చెరువులో కి వస్తుండడంతో స్వల్పంగా నీటి మట్టాన్ని తగ్గించేందుకు తూము తెరవడం జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేవని ఆయన అన్నారు.
