29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బల్దియాపై బిజెపి జెండా ఎగరవేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 … శక్తి కేంద్ర ఇన్చార్జ్ దొంతు రవి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరేలా పోలింగ్ అధ్యక్షులు కష్టపడి పని చేయాలని 21వ డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జీ జిల్లా దొంతుల రవి అన్నారు. పోలింగ్ బూత్ ల, డివిజన్ కన్వీనర్ దోదోల్ల గిరిబాబు అధ్యర్యంలో నూతన పొలింగ్ బూత్ అధ్యక్షులను, పొలింగ్ బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి పోలింగ్ స్థాయి కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారని అదే స్ఫూర్తితో కార్పొరేషన్ ఎన్నికలలో బల్దియాపై బిజెపి జెండా ఎగరవేయాలని అన్నారు.భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు కార్యకర్తల సమీకరణ మొదలైందన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనీ అన్నారు. బూత్ అధ్యక్షులుగా సతీష్, ప్రసాద్, బొబ్బిలి మహేష్,ప్రవీణ్ రెడ్డి,శ్రీనివాస్, అనిల్ కుమార్ అధ్యక్షులుగా జనరల్ సెక్రెటరీ సుధీర్ శ్రీధర్ సెక్రెటరీగా నియమితుల య్యారని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article