27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గుండె పోటుతో బీజేపీ నేత మృతి 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

నిజామాబాద్ అర్బన్ కు చెందిన బిజెపి నేత గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నగరానికి చెందిన బట్టికిరి ఆనంద్ (45) బిజెపి ఏడవ డివిజన్ శక్తి కేంద్రం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలిసింది. గడిచిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆనంద్ ప్రస్తుతం అర్థము ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ప్రధాన అనుచరుడీగా కొనసాగుతున్నారు. బట్టికిరి ఆనంద్ మృతి విషయం తెలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వారి ఇంటికి చేరుకొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

More articles

Latest article