27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రోకలి బండతో హత్య చేసిన నిందితుడు రిమాండ్ కు తరలింపు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో హత్య చేసిన వ్యక్తికి మంగళవారం  రిమాండ్ కు  తరలించినట్లు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి  తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం బిచ్కుంద గ్రామానికి చెందిన గుడ్లింగం వ్యవసాయం  చేసుకుంటూ  జీవించేవాడు.  పండరి బిచ్కుంద గ్రామం నందు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.  జల్సాలకు అలవాటు పడి కల్లు తాగడానికి డబ్బులు లేక  సులువుగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో గల్లీలో గల ముసలి వాళ్లపై ఉన్న బంగారు నగలను దొంగిలించేవాడు. వాటితో వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకునేవాడు. గల్లీలో ఉంటున్న గోనే కాశవ్వ ఇంటివద్ద ఎవరూ లేరని రెండు మూడు రోజులుగానుండి రెక్కీ నిర్వహించాడు. కొడుకు బాబయ్య టీ పాయింట్ వద్ద పనికి వెళ్లేవాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని ఒంటరిగా ఉన్న కాశవ్వను చూసి ఆదివారం మధ్యాహ్నం  ఇంట్లోకి వెళ్లి రోకలిబండతో ఆమెను కొట్టి చంపేసి తన మెడలో ఉన్న బంగారు గుండ్లను,  చెవులకు గల బంగారు నాగులను ఎత్తుకెళ్లాడు. మంగళవారం రోజునఉదయం పండరి పత్లాపూర్ శివారు లోని సలీం దాబా వద్ద ఉన్నాడని పోలీసుల విశ్వాసనీయ సమాచారం మేరకు అతనిని పట్టుకొనగా తాను చేసిన నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి బంగారం రికవరీ చేశామని తెలిపారు. కాశవ్వ హత్యకు కారణమైన పండరీని మంగళవారం జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ డి.ఎస్.పి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద సీఐ, జగడం నరేష్, ఎస్సై మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Accused of killing with pestle remanded

More articles

Latest article