24.7 C
Hyderabad
Monday, August 3, 2026

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

బోధన్ ,బతుకమ్మ :

బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభంకానున్న లయన్స్ జనరల్ ఆస్పత్రి ప్రజల ఆరోగ్య సేవలకు కొత్త దిక్సూచిగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆస్పత్రిని సందర్శించి నిర్మాణ పనులు, అందుబాటులో ఉండబోయే వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి ప్రజలకు అందించబోయే వైద్య సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్ రెడ్డి  మాట్లాడుతూ…ప్రైవేట్ హాస్పిటల్స్‌కు ఏమాత్రం తీసిపోని సదుపాయాలతో లయన్స్ జనరల్ ఆస్పత్రి ప్రారంభం కానుంది. ఆస్పత్రిలో ముగ్గురు  ఫిజీషియన్‌లు, ఇద్దరు జనరల్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది 24 గంటలు ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటారు. నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందించడం ప్రజలకు గొప్ప ప్రయోజనం. బోధన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు బసవేశ్వర్ రావు, నరసింహారెడ్డి, కొడాలి కిషోర్, నాగేశ్వర్ రావు, విజయ్ కుమార్, నాయకులు గంగా శంకర్, రామ్మోహన్, దాము, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

The services of the Lions Club are commendabl

More articles

Latest article