- రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్
బతుకమ్మ, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా వివిధ ఎస్టి సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాడని, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి, వంట గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు చెప్పినట్టుగా రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగిందనికొన్ని సాంకేతికల కారణాల వల్ల కొంతమందికి మాత్రమే రుణమాఫీ కాలేదని వారికి కూడా త్వరలోనే అందుతుందని తెలిపారు. ఎస్టీలకు కూడా కొంతమందికి ఎన్నో ఏళ్ల నుంచి పంట సాగు చేసుకుంటున్నా వారికి పట్టాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారికి కూడా త్వరలోనే పంట పండించుకుంటున్న రైతులందరికీ పట్టా పాసుబుక్కులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక బిజెపి,బిఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని ప్రజలు ఎవరు నమ్మడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు రాణా ప్రతాప్ రాథోడ్,లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రకాష్ నాయక్,కామారెడ్డి మండల అధ్యక్షులు మోహన్ నాయక్,పులి సింగ్,వినోద్,గణేష్,ప్రకాష్,వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

