27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించొద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : గ్రామ పంచాయతి ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించొద్దని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామంలో ఎన్నికల కోడ్ పై ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, రూలర్ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. ఆకుల కొండూరు గ్రామం క్రిటికల్ విలేజ్ గా గుర్తింపు ఉండటంతో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని కోవాలని, అది అందరి బాధ్యత అని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.

Do not violate the election code of conduct.

More articles

Latest article