25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ పాలనలో మహిళాభ్యుదయం

Must read

📰 Generate e-Paper Clip

  • రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభ్యుదయం సాధిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ మండలం పాల్ద గ్రామంలో 24 , మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో 39 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పంపిణీ చేశారు. గుండారం గ్రామంలో రూరల్ నియోజకవర్గానికి 550 మహిళా సంఘాలకు సంబంధించి రూ. 6కోట్ల 80 లక్షల రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఏమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని, చిరు వ్యాపారలకే పరిమితం కాకుండ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేందుకు చేయూత అందిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని భూపతిరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, అడిగిన వారందరికీ రేషన్ కార్డులను సైతం మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారని, దీంతో ఓర్వలేని టిఆర్ఎస్ బిజెపి నాయకులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రజలను తప్పుదోవ  పట్టిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే గడిచిందని రాబోయే మూడు సంవత్సరాల్లో మిగతా హామీలను సైతం పూర్తి చేసి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి అండగా నిలవాలని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, నాయకులు శ్రీధర్, జనార్దన్, సతీష్, రాజేష్ శర్మ, గంగా ప్రసాద్, భోజన్న గంగాధర్, కిరణ్ రావు, ఒడ్డెన్న,శ్రీధర్, ఉమ్మాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Women's advancement under Congress rule

Women's advancement under Congress rule

More articles

Latest article