చందూర్ ట్రిమ్స్ విద్యార్థి సూసైడ్ ఎఫెక్ట్

0 16,352
  • ప్రిన్సిపాల్ సస్పెన్షన్
  • ముగ్గురిని విధుల నుంచి డిస్మస్

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా చందూర్ మైనార్టీ గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థి ఆత్మహత్య కేసులో బాధ్యులపై అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. నగరంలోని ధర్మపురి హిల్స్ కు చెందిన గౌస్ (14) ఈ నెల 23న రాత్రి చందూర్ ట్రిమ్స్ పాఠశాల వసతి గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. ఒకరోజు ముందే ఇంటి నుంచి వచ్చిన గౌస్ ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా గుర్తించడంలో విధులు నిర్వహిస్తున్నవారి నిర్లక్ష్యం ఉందని అధికారుల విచారనలో తేలిందని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిని కృష్ణవేణి తెలిపారు. ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ఎకనామిక్స్ జూనియర్ లెక్చరర్ నవీన్ కుమార్, టీజీటీ స్పెషల్ టీచర్ అతీఫా నస్రీన్, సెక్యూరిటీ గార్డు సాయిలను డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.