కాంగ్రెస్ పాలనలో మహిళాభ్యుదయం
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభ్యుదయం సాధిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ మండలం పాల్ద గ్రామంలో 24 , మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో 39 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పంపిణీ చేశారు. గుండారం గ్రామంలో రూరల్ నియోజకవర్గానికి 550 మహిళా సంఘాలకు సంబంధించి...