28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాస్థాయి ఇన్ స్పైర్ కు సుంకేట్ విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: జిల్లాస్థాయి ఇన్ స్పైర్, రాజ స్థరియ బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో మోర్తాడ్ మండలంలోని సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రదర్శనలను  ప్రదర్శించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ తెలిపారు. మైక్రో గ్రీన్ తో ఎక్కువ కాలం జీవించు అనే అంశంపై విద్యార్థులు ప్రదర్శించినట్ల ఆయన పేర్కొన్నారు. మైక్రో గ్రీన్స్ వాటి పెంపకం వాటిలో ఉండే పోషక విలువలు ఖనిజ సంపదల గురించి వివరించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article