24 C
Hyderabad
Sunday, August 2, 2026

వోడినాల నర్సయ్య కు నివాళులర్పించిన అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం లోని చాకిర్యాల్ గ్రామానికి చెందిన అమరవీరుడు వోడినాల నర్సయ్య ఇంటికి పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏ సీ పీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ సబ్ డివిజన్ ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని బుధవారం వెళ్లి నర్సయ్య కీ ఘన నివాళి అర్పించారు. తదనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నర్సయ్యా 1989 సివిల్ కానిస్టేబుల్ గా ఎన్నికై డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు 1991 లొ బాంబు బ్లాస్ట్ లో తన ప్రాణాలు కోల్పోయారనీ , వారి కుటుంబానికి పోలీసులు ఎప్పటికీ అండగా ఉంటారని  పోలీసు అధికారులు పేర్కొన్నారు.

More articles

Latest article