ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మి ఇటీవలే పురుగుల మందు తాగి మరణించిన విషయం తెలిసిందే.విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి బుధవారం మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. జంగిరి లక్ష్మి మరణించడంతో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. గ్రామానికి కాంగ్రెస్ నాయకురాలుగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు.మనసులో ఎలాంటి కల్మషం లేకుండా కలిసిమెలిసి ఉండేదని గుర్తు చేశారు,వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, ఎన్డిసిసిబి డైరెక్టర్ కోరట్పల్లి ఆనంద్ సంతోష్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చింతల్ ఎలక్ట్రిషన్, దశరథ్, వసంత్ రావు,కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

